అమావాస్య
అలిగిన జాబిల్లి నేడు
ఆకసంలో కానరాడు
కర్పూరం కరిగినట్లు
కడకు మాయమైనాడు....
సదాశివుని శిఖములోన
చిక్కి బంధీ ఐనాడో?
కలువపూల కౌగిలిలో
బిగిసి శ్వాస విడిచినాడో?
మబ్బుల రథములుయెక్కి
మరి దారి తప్పిపోయినాడో?
లేక మధుపానీయంబు తాగి
మత్తులలో మునిగినాడో?
ఆ రవి ఆరని మంటల
కాహుతేమో ఐనాడో?
ఈ భువిపై అక్రమాలకోర్వక
ముఖముతిప్పి మాడ్చినాడో?
తారకలెన్నొ ఉన్నా
తాను మాత్రమొంటరియై
తల్లి లేని పిల్లవాడినని
తలచి బెంగపడ్డాడో?
అలిగిన జాబిల్లి నేడు
ఆకసంలో కానరాడు
కర్పూరం కరిగినట్లు
కడకు మాయమైనాడు......
ఆకసంలో కానరాడు
కర్పూరం కరిగినట్లు
కడకు మాయమైనాడు....
సదాశివుని శిఖములోన
చిక్కి బంధీ ఐనాడో?
కలువపూల కౌగిలిలో
బిగిసి శ్వాస విడిచినాడో?
మబ్బుల రథములుయెక్కి
మరి దారి తప్పిపోయినాడో?
లేక మధుపానీయంబు తాగి
మత్తులలో మునిగినాడో?
ఆ రవి ఆరని మంటల
కాహుతేమో ఐనాడో?
ఈ భువిపై అక్రమాలకోర్వక
ముఖముతిప్పి మాడ్చినాడో?
తారకలెన్నొ ఉన్నా
తాను మాత్రమొంటరియై
తల్లి లేని పిల్లవాడినని
తలచి బెంగపడ్డాడో?
అలిగిన జాబిల్లి నేడు
ఆకసంలో కానరాడు
కర్పూరం కరిగినట్లు
కడకు మాయమైనాడు......
సిద్దార్థా పాములపర్తి
జూలై ౧౧, ౨౦౦౮
Comments
It's encouraging and hope I can do better next time.
thanks raa. i have been reading a lot of telugu literature these days, may be that's the reason I was able to write these.
if i get to learn sanskrit in this life, i most certainly will experiment it too. for now, i am in total love with english and telugu.