పౌర్ణమి

నిండు వెన్నెల కుండపోతగా
కురిపిస్తాడు మురిపిస్తాడు
తామర పూవుల రెక్కలనన్ని
తెరిపిస్తాడు మెరిపిస్తాడు
నిషాచరులను శశీకిరణముల
తడిపిస్తాడు నడిపిస్తాడు
కైలాసంలో కాన్తులనెన్నో
ఛల్లిస్తాడు ఝల్లిస్తాడు
ప్రభాకరుని ప్రతిబింబంబై
వెలుగిస్తాడు గెలుపిస్తాడు
అవనిఘర్భమున అన్యాయాల
పనిచూస్తాడు అణిచేస్తాడు

చుక్కలనన్ని చక్కగచేర్చి
లాలిస్తాడు పాలిస్తాడు
ఆదిశక్తియే ఆతని అమ్మగ
తిలకిస్తాడు పులకిస్తాడు...
చిన్నపిల్లలకు చందమామయై,
యువతకు తమ తమ ప్రేయసిప్రియుడై,
గృహిణిగృహులకు అనుకూల గ్రహంబై...
అన్నీ యెరిగిన పెద్దవారలకు
అద్వైతము తానై వేదాంతసారముల
వెలుగిస్తాడు పలుకిస్తాడు...


సిధ్ధార్థా పాములపర్తి
జూలై ౧౯, ౨౦౦౮

Comments

Popular posts from this blog

Gajendra Moksham - Part-2

పోతన భాగవత మకరందాలు

Prahlada's beautiful answer to his father