శ్రీ కృష్ణ జన్మాష్టమి
నీవు - జగములనేలే పరమాత్ముడవు జన్మనెత్తిన పురుషోత్తముడవు గోవుల గాచిన గోవిందుడవు గోపిక వలచిన గోపాలుడవు శాంత రూపుడవు నారాయాణుడవు ఉగ్ర రూపుడవు నారసింహుడవు గీతనుపలికిన శ్రీ కృష్ణుడవు; నిన్నే నమ్మిన ధ్రువుడను నేను పసివాడను నే ప్రహ్లాదుడను కుచేలుడి వంటి బీద వాడను నీకై వేచే శభరి ని నేను! నీ నామములు నే విని పులకిస్తూ, నీ దివ్య రూపములు నే తిలకిస్తూ, నా మది నిండుగ నిన్నే నింపిన నా తలిదండ్రుల, గురువుల తలుస్తూ ; నా భవహరమును కావగ నాకై భాగవత కావ్యంబు రచించిన కవిగురు పరమ భక్త పోతనకు నిత్యం నివాళులు అర్పణచేస్తూ : భాద్రపద బహుల అష్టమి దినమున ధర్మపాలన చేయగ దివిపై అవతరించిన అచ్యుత నీకిదే నా హృది పలికిన మంగళహారతి! -సిధ్ధార్థా పాములపర్తి janmaashtami, 2008