లోకం తీరు

 ఎగిరిపోవె విహంగమై 

అలిసిపొయిన హృదయమా 

ఎగిసిపడ్తున్న అలలలా 

కలిసిపో  కడలిలోపల 


వెనుదిరిగి చూడకు

వెక్కిరించె నేలవైపు 

ఎగిసిపో నింగిలోకి 

ఎవరికందని తారవై 


మురికి లొ మునగకు 

ముఖం లేని మొద్దులా 

పువ్వు వై విచ్చుకొ 

మహావృక్షపు కొమ్మపై 


గులాబి వై వంగిపొకు

ముల్లు నిండిన చెట్టులొ 

నీరు అంటని కలువవైపొ

తామరాకుపై నిలబడి 

Comments

kalvakota said…
Wonderful composition

Popular posts from this blog

Gajendra Moksham - Part-2

పోతన భాగవత మకరందాలు

Prahlada's beautiful answer to his father