Posts

Showing posts from July, 2008

పౌర్ణమి

నిండు వెన్నెల కుండపోతగా కురిపిస్తాడు మురిపిస్తాడు తామర పూవుల రెక్కలనన్ని తెరిపిస్తాడు మెరిపిస్తాడు నిషాచరులను శశీకిరణముల తడిపిస్తాడు నడిపిస్తాడు కైలాసంలో కాన్తులనెన్నో ఛల్లిస్తాడు ఝల్లిస్తాడు ప్రభాకరుని ప్రతిబింబంబై వెలుగిస్తాడు గెలుపిస్తాడు అవనిఘర్భమున అన్యాయాల పనిచూస్తాడు అణిచేస్తాడు చుక్కలనన్ని చక్కగచేర్చి లాలిస్తాడు పాలిస్తాడు ఆదిశక్తియే ఆతని అమ్మగ తిలకిస్తాడు పులకిస్తాడు... చిన్నపిల్లలకు చందమామయై, యువతకు తమ తమ ప్రేయసిప్రియుడై, గృహిణిగృహులకు అనుకూల గ్రహంబై... అన్నీ యెరిగిన పెద్దవారలకు అద్వైతము తానై వేదాంతసారముల వెలుగిస్తాడు పలుకిస్తాడు... సిధ్ధార్థా పాములపర్తి జూలై ౧౯, ౨౦౦౮

అమావాస్య

అలిగిన జాబిల్లి నేడు ఆకసంలో కానరాడు కర్పూరం కరిగినట్లు కడకు మాయమైనాడు.... సదాశివుని శిఖములోన చిక్కి బంధీ ఐనాడో? కలువపూల కౌగిలిలో బిగిసి శ్వాస విడిచినాడో? మబ్బుల రథములుయెక్కి మరి దారి తప్పిపోయినాడో? లేక మధుపానీయంబు తాగి మత్తులలో మునిగినాడో? ఆ రవి ఆరని మంటల కాహుతేమో ఐనాడో? ఈ భువిపై అక్రమాలకోర్వక ముఖముతిప్పి మాడ్చినాడో? తారకలెన్నొ ఉన్నా తాను మాత్రమొంటరియై తల్లి లేని పిల్లవాడినని తలచి బెంగపడ్డాడో? అలిగిన జాబిల్లి నేడు ఆకసంలో కానరాడు కర్పూరం కరిగినట్లు కడకు మాయమైనాడు...... సిద్దార్థా పాములపర్తి జూలై ౧౧, ౨౦౦౮

Bob Dylan- A Tribute

Image
Some inspiring and interesting lyrics from various songs of Bob Dylan: Bob dylan's lines: 1) You don't understand it - my feelings for you Well, you'd be honest with me if only you knew (Honest with me) 2) But if you got to go, It's all right. But if you got to go, go now, Or else you gotta stay all night. 3) I'll remember you When I've forgotten all the rest, You to me were true, You to me were the best. When there is no more, You cut to the core Quicker than anyone I knew. When I'm all alone In the great unknown, I'll remember you. I'll remember you At the end of the trail, I had so much left to do, I had so little time to fail. There's some people that You don't forget, Even though you've only seen'm One time or two. When the roses fade And I'm in the shade, I'll remember you. Didn't I, didn't I try to love you? Didn't I, didn't I try to care? Didn't I sleep, didn't I weep beside you With the rain bl...