లోకం తీరు
ఎగిరిపోవె విహంగమై అలిసిపొయిన హృదయమా ఎగిసిపడ్తున్న అలలలా కలిసిపో కడలిలోపల వెనుదిరిగి చూడకు వెక్కిరించె నేలవైపు ఎగిసిపో నింగిలోకి ఎవరికందని తారవై మురికి లొ మునగకు ముఖం లేని మొద్దులా పువ్వు వై విచ్చుకొ మహావృక్షపు కొమ్మపై గులాబి వై వంగిపొకు ముల్లు నిండిన చెట్టులొ నీరు అంటని కలువవైపొ తామరాకుపై నిలబడి