The Paper Boats (Rabindranath Tagore)
Translation attempted in Telugu Original: The Paper Boats (from The Crescent Moon) by Rabindranath Tagore ప్రతి రోజు నా కాగితపు పడవలని ఒకటొకటిగా పారుతున్న సెలయేటిలోకి వదిలేస్తుంటాను. వాటిపై నల్లని సిరాతో , పెద్ద పెద్ద అక్షరాలతో నా పేరు, నేనుండే ఊరి పేరు రాస్తాను. ఎక్కడో దూర ప్రాంతాలలో, ఎవరో ఒకరైనా నా పడవని చూసి నా గురించి తెలుసుకుంటారని ఒక ఆశ. నా నావలలో, మా పెరట్లో పెరిగే పారిజాతాలు నింపేస్తుంటాను , అవి నిండు రేయిలో విచ్చుకొని తమ సువాసనలు వెదజల్లుతూ క్షేమంగా పయనించి తీరం చేరుతాయని ఇంకో ఆశ. నా పడవలని నీటిలో సాగనంపుతూ, ఆకాశంలో తేలుతున్న చిన్నారి తెల్ల మబ్బులను చూస్తూ - నాకు తెలియని నేస్తం ఎవరో ఆ నింగినుండి నా పడవలకు పోటీగా వాటిని పంపుతున్నారని ఆనందిస్తుంటా. రాత్రి కాగానే నా ముఖాన్ని నా చేతులలో ముంచేసి , నా కాగితపు నావలు ఆ నక్షత్రాల కింద మునగకుండా ఇంకా ముందుకు సాగుతున్నాయని కలవరిస్తుంటాను. నిద్దురపుచ్చే అప్సరసలు, వారి చేతులలో తీయటి కలలు నిండా నింపిన బుట్టలని తీసుకొని - ఆ నావలలో దేశ దేశాలు తిరుగుంటారు మరి!